Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నేటినుంచే..
ముల్హిమ్ యాన్డెర్హ్(జర్మనీ): భారత టాప్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, పివి సింధు మరో టైటిల్‌పై కన్నేసారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జర్మన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో గెలుపే లక్ష్యంగా వీరు బరిలో దిగనుండగా.. యువ షట్లర్ లక్ష్యసేన్ కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాధించిన లక్ష్యసేన్ అద్భుత ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఈ ఏడాది కామన్వెల్ గేమ్స్ ఉన్న నేపథ్యంలో తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. మహిళల సింగిల్స్‌లో పివి సింధు 7వ సీడ్లో ఉండగా.. ఆమె తొలిరౌండ్లో థారులాండ్‌కు చెందిన 11వ సీడ్ బూసనన్తో తలపడనుంది. లక్ష్యసేన్ స్పెయిన్‌కు చెందిన హెల్వాతో తలపడనుండగా.. కిదాంబి శ్రీకాంత్‌కు మాత్రం క్లిష్టమైన డ్రా ఎదురుకానుంది. తొలిరౌండ్లో 8వ సీడ్ లెవెర్డెజ్(ఫ్రాన్స్)తో ఆడనున్నాడు. భారత్‌నుంచి టోర్నీ బరిలో మొత్తం 10మంది షట్లర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 5వ సీడ్ జపాన్‌కు చెందిన 5వ సీడ్ మట్సుయమ, ఛిహారుతోను, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-సాయి ప్రణీత్ కూడా బరిలోకి దిగనున్నారు.