Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్
అమ్మన్(జోర్డాన్): ఆసియా యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. భారత యువ బాక్సర్లు విశ్వనాథ్ సురేశ్, రామన్ సెమీఫైనల్‌కు చేరారు. సోమవారం జరిగిన 48కిలోల విభాగం క్వార్టర్ఫైనల్లో విశ్వనాథ్ తజకిస్తాన్‌కు చెందిన మేరోజ్ జొడోవ్పై 4-1 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 51కిలోల విభాగంలో రామన్ జోర్డాన్‌కు చెందిన యాజన్ను 5-0పాయింట్ల తేడాతో ఓడించాడు. వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకొని సెమీస్‌కు చేరిన వీరిద్దరికి కనీసం కాంస్య పతకాలు దక్కనున్నాయి. గత సీజన్లో విశ్వనాథ్ రజతం కైవసం చేసుకున్నాడు. యూత్ బాక్సింగ్‌లో ఐదుగురు, జూనియర్ బాలుర విభాగంలో ముగ్గురు బాక్సర్లు సోమవారం రాత్రి క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.