Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: శ్రీలంకతో జరగనున్న రెండో, ఆఖరి టెస్ట్‌లో అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. బెంగళూరులోని ఎన్సిఏలో ఫిట్నెస్ నిరూపించుకోవడంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు కల్పించనున్నట్లు టీమిండియా మేనేజ్మెంట్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచి శ్రీలంకతో చివరి టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు అక్షర్ గాయపడడంతో బెంగళూరులో ఎన్సిఏలో ఫిట్నెస్ టెస్ట్‌కు హాజరయ్యాడు. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కూ అక్షర్ దూరం కావడంతో శ్రీలంకతో జరిగే ఆఖరి టెస్ట్‌కు తిరిగి భారతజట్టులో చేరనున్నట్లు టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. 2021 ఫిబ్రవరి తర్వాత కుల్దీప్ యాదవ్ భారతజట్టులో చోటు దక్కించుకోగా.. తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.