Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వరల్డ్ నం.1 ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. మొహాలిలో శ్రీలంకతో తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన జడేజా.. మూడు రోజుల్లోనే భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. అజేయ 175 పరుగుల ఇన్నింగ్స్‌తో పాటు 9 వికెట్లు సైతం పడగొట్టాడు. రవీంద్ర జడేజా వన్ మ్యాన్ షోతో టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 406 రేటింగ్ పాయింట్లతో జేసన్ హోల్డర్ (382)ను వెనక్కి నెట్టి నం.1 స్థానంలో నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ (347) మూడో స్థానంలో నిలువగా.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (287) ఐదో స్థానంలో నిలిచాడు. బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి రెండు స్థానాలు మెరుగయ్యాడు. 763 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ ఓ స్థానం దిగజారి ఆరో స్థానానికి పరిమితం అయ్యాడు. రిషబ్ పంత్ టాప్-10లోకి ప్రవేశించాడు.