Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌తో భారత్ ఢ నేడు
- ఉదయం 6.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
హామిల్టన్ : భారత మహిళల జట్టు నేడు కీలక పోరుకు సిద్ధమైంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై ఏకపక్ష విజయం నమోదు చేసిన టీమ్ ఇండియా.. నేడు ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఎదుర్కొనుంది. ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో పాటు న్యూజిలాండ్ సైతం ఆధిపత్యం చూపిస్తోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఇటీవల ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై సాధికారిక విజయం సాధించిన న్యూజిలాండ్ అమ్మాయిలు నేడు విజయంపై ధీమాతో బరిలోకి దిగుతున్నారు. చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై పైచేయి సాధించిన మిథాలీసేన.. వరల్డ్‌కప్ వేటలో నూతన ఉత్సాహంతో కనిపిస్తోంది. ఆతిథ్య న్యూజిలాండ్‌కు నేడు భారత్ ఊహించని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
రెట్టించిన ఉత్సాహంతో.. : ఇటీవల ద్వైపాక్షిక సిరీస్‌లో టీమ్ ఇండియా తేలిపోయింది. అయినా, పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ వరల్డ్‌కప్‌లో సరికొత్తగా బరిలోకి దిగింది. టాప్ ఆర్డర్లో షెఫాలీ వర్మ, మిడిల్ ఆర్డర్లో హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఈ ఇద్దరు పరుగుల వేటలో కదం తొక్కితే భారత్‌కు ఎదురుండదు. స్మృతీ మంధాన, దీప్తి శర్మలు టాప్ ఆర్డర్లో జోరు మీదున్నారు. లోయర్ ఆర్డర్లో పూజ వస్ట్రాకర్, స్నేV్‌ా రాణాలు అద్వితీయంగా ఆడుతున్నారు. ముగింపులో ఈ ఇద్దరు బ్యాటింగ్ విన్యాసాలు భారత్‌కు అదనపు బలం. న్యూజిలాండ్‌కు లక్ష్యాన్ని నిర్దేశించినా.. న్యూజిలాండ్‌పై లక్ష్యాన్ని ఛేదించినా కఠినంగానే ఉంటుంది. దీంతో బ్యాటర్లతో పాటు బౌలింగ్ లైనప్ సైతం అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి, పూజ వస్ట్రాకర్కు తోడు స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేV్‌ా రాణాలు కివీస్ బ్యాటింగ్ లైనప్‌ను మాయ చేయాల్సి ఉంది. కెప్టెన్ మిథాలీరాజ్ వరల్డ్‌కప్‌లో తనదైన ఇన్నింగ్స్ నమోదు చేయాలని ఎదురు చూస్తోంది.
మరోవైపు న్యూజిలాండ్ సైతం విజయాల ఊపుమీదుంది. భారత జట్టుపై కివీస్‌కు మెరుగైన రికార్డు సైతం కలిసొచ్చే అంశం. అమేలీ ఖేర్, సుజీ బేట్స్ల పరుగుల వేటకు అడ్డుకట్ట వేయటం అంత సులువు కాదు. హన్నా రోవె, లీ టహుహులు బంతితో భారత్‌కు ప్రమాదకారులు. సొంతగడ్డపై ఆడుతుండటం కివీస్‌కు అదనపు అనుకూలత. ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.