Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రషట్లర్లకు రెండో రౌండ్లోనే ఓటమి
- జర్మనీ ఓపెన్ బ్యాడ్మింటన్
బెర్లిన్ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణులకు జర్మనీ ఓపెన్‌లో చుక్కెదురు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు, లండన్ ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్‌లకు రెండో రౌండ్లోనే అనూహ్య పరాజయం ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ ముందడుగు వేయగా.. మహిళల సింగిల్స్‌లో భారత టైటిల్ ఆశలకు తెరపడింది. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధుకు చైనా షట్లర్ షాక్ ఇచ్చింది. 14-21, 21-15, 14-21తో జాంగ్ యి మన్ చేతిలో సింధు ఓటమి చెందింది. 55 నిమిషాల పాటు సాగిన మూడు గేముల ఉత్కంఠ మ్యాచ్‌లో సింధుపై జాంగ్ పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ తడబాటు కొనసాగింది. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా 10-21, 15-21తో వరుస గేముల్లో ఎనిమిదో సీడ్ రచనాక్ ఇంటనాన్ (థారులాండ్) చేతిలో ఓటమి పాలైంది. థారులాండ్ షట్లర్ రచనాక్ అలవోకగా వరుస గేముల్లో గెలుపొందింది. సైనా నెహ్వాల్‌ను ఇంటి దారి పట్టించింది. కోవిడ్ పాజిటివ్‌తో ఇండియా ఓపెన్‌కు దూరమైన కిదాంబి శ్రీకాంత్ జర్మనీ ఓపెన్‌లో దుమ్మురేపుతున్నాడు. 21-16, 21-23, 21-18తో చైనా షట్లర్ లు గువాంగ్ జుపై హోరాహోరీ పోరులో గెలుపొందాడు. తొలి రౌండ్లో సైతం మూడు గేముల్లో గెలుపొందిన శ్రీకాంత్.. రెండో రౌండ్లో సైతం చెమటో డ్చాడు. పురుషుల డబుల్స్‌లో ఇషాన్, సాయి ప్రతీక్ జోడీ 21-23, 21-16, 14-21తో సహచర భారత జోడీ క్రిష్ట ప్రసాద్, విష్ణువర్ధన్ జంట చేతిలో పరాజయం పాలైంది.