Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో శ్రీలంక మాజీ సారథి లసిత్ మలింగ పున్ణప్రవేశించనున్నాడు. ఈసారి బౌలర్లకు తర్ఫీదునిచ్చేందుకు రంగంలోకి దిగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మలింగను నియమితుడయ్యాడు. ఈనెల 26 నుంచి లీగ్ షురూ కానుండడంతో రాజస్థాన్ జట్టు సహాయక సిబ్బందిని నియమించుకుంది. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మలింగను.. టీమ్ క్యాటలిస్ట్‌గా ప్యాడీ ఉప్తన్ను నియమిస్తూ ఫ్రాంచైజీ యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. లంక తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 340 మ్యాచ్‌లు ఆడిన మలింగ 546 వికెట్లు పడగొట్టాడు. 'ఐపీఎల్‌లోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్‌లో చేరడం గౌరవంగా ఉంది' అని మలింగ తెలిపింది. రాజస్థాన్ సహాయ సిబ్బందిలో ఇప్పటికే ట్రెవర్ పెన్నీ, జుబిన్ బరుచా, దిశాంత్ యాగ్ఞిక్ ఉన్న విషయం తెలిసిందే.