Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బారు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మూడో ఇన్నింగ్స్‌కు సన్నద్ధం అవుతున్నాడు. క్రీడాకారుడిగా, కోచ్‌గా అసమాన విజయాలు సాధించిన గోపీచంద్.. తాజాగా క్రీడా పాలకుడి అవతారం ఎత్తనున్నాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు) ఉపాధ్యక్ష పదవికి గోపీచంద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి రేసులో గోపీచంద్ ఉన్నట్టు తొలుత వార్తలొచ్చినా.. బారు నిబంధనలతో ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టుకున్నాడు. బారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు మాత్రమే ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులు. బారు 12 మంది ఉపాధ్యక్షుల్లో ఒకరుగా గోపీచంద్ ఉండనున్నారు. అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అధ్యక్షుడిగా పూర్తి ప్యానల్ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే అని చెప్పవచ్చు.