Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూర్లో భారత్, శ్రీలంక పింక్ బాల్ టెస్టుకు వంద శాతం సామర్థ్యంతో అభిమానులను అనుమతించనున్నారు. శనివారం నుంచి ఆరంభం కానున్న టెస్టు మ్యాచ్కు తొలుత 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అభిమానుల ప్రవేశానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. విరాట్ కోహ్లి సొంత మైదానంలో టెస్టు పోరుకు అభిమానుల నుంచి టికెట్ల కోసం తీవ్రమైన ఆసక్తి నెలకొంది. టికెట్ల వేటలో అభిమానుల ఆసక్తితో కర్ణాటక క్రికెట్ సంఘం (కెఎస్సీఏ) పునరాలోచన చేసింది. 100 శాతం అభిమానుల ప్రవేశానికి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది.