Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కొత్త కెప్టెన్ ఎవరనే సందిగ్ధతకు తెరపడింది. ఆ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా ఆర్సీబీ పగ్గాలు అందుకున్న ఆటగాని పేరును వెల్లడించింది. దక్షిణాఫ్రికా మాజీ సారధి, మెగా వేలంలో రూ.7 కోట్లకు దక్కించుకున్న డుప్లెసిస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. 'ఇక నుంచి ఈ సింహాల గుంపుకు నాయకుడు ఇతనే' అని క్యాప్షన్‌ను జోడించింది. డుప్లెసిస్ గత సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడాడు. దీంతో ఆర్సీబీ జట్టుకు 7వ కెప్టెన్‌గా డుప్లెసిస్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్, పీటర్సన్, అనిల్ కుంబ్లే, వెట్టోరి, వాట్సన్, కోహ్లి ఆర్సీబీ జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు. ఇక కోహ్లి కెప్టెన్‌గా 140మ్యాచుల్లో 64విజయాలు, 68పరాజయాలతోపాటు మూడు మ్యాచ్ డ్రా అయ్యాయి. మరో 4మ్యాచుల్లో ఫలితం తేలలేదు. విజయాల శాతం 48.16గా ఉంది. ఇక డుప్లెసిస్‌కు ఐపిఎల్‌లో 100మ్యాచులు ఆడిన అనుభవముంది.