Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియా 252ఆలౌట్
- శ్రీలంక 86/6
బెంగళూరు: శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభమైన పింక్‌బాల్ (డే/నైట్)టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 252పరుగులకే పరిమితమైనా.. శ్రీలంక జట్టు 86 పరుగులు చేసే సరికి 6 వికెట్లను పడగొట్టింది. తొలుత శ్రేయస్ అయ్యర్ తృటిలో సెంచరీని మిస్ చేసుకోవడంతో భారతజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 252పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్లు నిరాశపరిచారు. మయాంక్(4), కెప్టెన్ రోహిత్(15) త్వరగా పెవీలియన్‌కు చేరిపోయారు. లసిత్ ఎంబుల్దేనియ, జయవిక్రమ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడి వికెట్లు సమర్పించుకున్నారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. 98 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో 92 పరుగులు సెంచరీకి దగ్గర్లో ఔటయ్యాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్(39), హనుమ విహారి(31) ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక జట్టుకు భారత పేసర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మెండీస్(2), కెప్టెన్ కరుణరత్నే(4), తిరిమానే(8) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ మాథ్యూస్(43) ఫర్వాలేదనిపించినా.. బుమ్రా వేసిన ఓ గుడ్‌లెంగ్త్ బంతికి మాథ్యూస్ ఔటయ్యాడు. ధనుంజయ(10), అసలంక కూడా క్రీజ్‌లో కుదురుకోలేదు. దీంతో లంక జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 86పరుగులు చేసింది. బుమ్రాకు మూడు, షమీకి రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
ఇండియా తొలి ఇన్నింగ్స్: అగర్వాల్ (రనౌట్) జయవిక్రమ/డిక్వెల్లా 4, రోహిత్ (సి)ధనుంజయ (బి)ఎంబుల్డేనియ 15, విహారి (సి)డిక్వెల్లా (బి)జయవిక్రమ 31, విరాట్ కోహ్లి (ఎల్బి) ధనుంజయ 23, పంత్ (బి)ఎంబుల్డేనియ 39, శ్రేయస్ (స్టంప్)డిక్వెల్లా (బి)జయవిక్రమ 92, జడేజా (సి)తిరిమానే (బి)ఎంబుల్డేనియ 4, అశ్విన్ (సి)డిక్వెల్లా (బి)ధనుంజయ 13, అక్షర్ పటేల్ (బి)లక్మల్ 9, షమీ (సి)ధనుంజయ (బి)జయవిక్రమ 5, బుమ్రా (నాటౌట్) 0, అదనం 17. (59.1 ఓవర్లలో ఆలౌట్) 252పరుగులు.
వికెట్ల పతనం: 1/10, 2/29, 3/76, 4/86, 5/126, 6/148, 7/183, 8/215, 9/229, 10/252
బౌలింగ్: లక్మల్ 8-3-12-1, ఫెర్నాండో 3-0-18-0, ఎంబుల్డేనియ 24-2-94-3, జయవిక్రమ 17.1-3-81-3, ధనుంజయ 7-1-32-2.