Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్‌పై 155పరుగుల తేడాతో గెలుపు
- ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్
హామిల్టన్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు మరో విజయాన్ని సాధించింది. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలతో కదం తొక్కడంతో భారత జట్టు 155పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. వెస్టిండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్ రాణా, మేఘ్నా సింగ్ బౌలింగ్‌లో రాణించారు. వెస్టిండీస్ జట్టుకు ప్రారంభంలో మంచి ఆరంభం లభించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు మేఘ్నా సింగ్, స్నేV్‌ా రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ నాలుగు వికెట్లు తీశారు. ఓపెనర్ డియాండ్రా డాటిన్ 46 బంతుల్లో 62 పరుగుల వద్ద ఔటైంది. డోటిన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించి షార్ట్ ఫైన్ లెగ్ వద్ద మేఘనాకు క్యాచ్ ఇచ్చింది. 43 పరుగులు చేసిన హేలీ మాథ్యూస్ స్నేహ ఫ్లైడ్ బంతిని అర్థం చేసుకోలేక వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేయగా.. హర్మన్‌ప్రీత్ 109 పరుగులు సాధించింది. వీరిద్దరు కలిసి నాల్గో వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెస్టిండీస్ బౌలర్ అనీస్ మహమ్మద్ 59 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. సాల్మన్ 43 పరుగులకు ఒక వికెట్ తీసింది. ప్రపంచ కప్‌లో టీమిండియా తొలిసారి 300 పరుగుల మార్క్‌ను దాటింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్మృతి మంధానాకు లభించింది. విండీస్ జట్టు తొలి రెండో మ్యాచుల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్లను ఓడించి దుర్భేద్యఫామ్‌లో ఉన్నా.. భారత్ ముందు ఆ ఎత్తులు పారలేదు. ఇక వెస్టిండీస్‌పై మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం.
మిథాలీ, జులన్ ప్రపంచ రికార్డులు..
భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి, టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా రికార్డులను నమోదు చేసుకున్నారు. పేస్ బౌలర్ జులన్ గోస్వామి విండీస్ బ్యాటర్ అనీషా మహమ్మద్ వికెట్ తీసి ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు(40) తీసిన బౌలర్‌గా నిలిచింది. ఇక మిథాలీరాజ్ మహిళల ప్రపంచ కప్‌లలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న రికార్డును తన పేర లిఖించుకుంది. మిథాలీరాజ్ 23మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ సాధించిన రికార్డును బ్రేక్ చేసింది.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి)సెల్మన్ (బి)షమీలియా 123, యస్టికా భాటియా (సి అండ్ బి) సెల్మన్ 31, మిథాలీ (సి)షమీలియా (బి)మాథ్యూస్ 5, దీప్తి (సి)మాథ్యూస్ (బి)మహ్మద్ 15, హర్మన్ ప్రీత్ (సి)క్యాంప్‌బెల్ (బి)అలైన్ 109, రీచా ఘోష్ (రనౌట్) మాథ్యూస్/క్యాంప్‌బెల్ 5, పూజ (సి)మాథ్యూస్ (బి)మహ్మద్ 10, గోస్వామి (సి)మహ్మద్ (బి)డొట్టిన్ 2, స్నేహ్ రాణా (నాటౌట్) 2, మేఘ్నా సింగ్ (నాటౌట్) 1, అదనం 14. (50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 317పరుగులు.
వికెట్ల పతనం: 1/49, 2/58, 3/78, 4/262, 5/290, 6/311, 7/313, 8/315
బౌలింగ్: షమీలియా 10-0-57-1, హెన్రీ 2-0-19-0, మాథ్యూస్ 10-0-65-1, సెల్మన్ 7-0-41-1, మహ్మద్ 9-0-59-2, డోట్టిన్ 5-0-32-1, టేలర్ 3-0-18-0, ఆలియా 4-0-26-1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: డోట్టిన్ (సి)మేఘ్నా (బి)స్నేV్‌ా 62, మాథ్యూస్ (సి)రీచా (బి)స్నేV్‌ా 42, నైట్ (సి)స్మృతి (బి)మేఘ్నా 5, టేలర్ (సి)రీచా (బి)మేఘ్నా 1, క్యాంప్‌బెల్ (సి)గైక్వాడ్ (బి)పూజ 11, నేషన్ (రనౌట్) మేఘ్నా/దీప్తి 19, హెన్రీ (ఎల్బి)గైఆక్వాడ్ 7, ఆలియా (రనౌట్) గైక్వాడ్/స్నేV్‌ా 4, అనీష (సి అండ్ బి) గోస్వామి 2, షాకిరా (నాటౌట్) 7, షమీలియా (సి అండ్ బి)స్నేహ్ 0, అదనం 1. (40.3ఓవర్లలో ఆలౌట్) 162పరుగులు.
వికెట్ల పతనం: 1/100, 2/108, 3/112, 4/114, 5/1257. 6/134, 7/145, 8/155, 9/157, 10/162
బౌలింగ్: జులన్ గోస్వామి 6-1-43-1, మేఘ్నా సింగ్ 6-0-27-2, దీప్తి 7-2-24-0, గైక్వాడ్ 10-3-24-1, పూజ 2-0-1-1,స్నేహ్ 9.3-1-22-3.