Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డాక్టర్ల కోసం ఐపీఎల్ తరహాలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ఏర్పాటైంది. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మార్గనిర్దేశంలో డాక్టర్స్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ (డీసీపీఎల్) హైదరాబాద్ వేదికగా వచ్చే నెల 19 నుంచి 24 వరకు జరగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ వరల్డ్ వన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ, డ్రీమ్జ్ 11 స్పోర్ట్స్ సంస్థ రూపొందించిన డీసీపీఎల్లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. డీసీపీఎల్ ఎనిమిది ప్రాంఛైజీ జట్ల పేర్లు, లోగోలను ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ప్రనామ్ హీరోస్, రెనోవా వారియర్స్, కిమ్స్ నైట్ రైడర్స్, లైఫ్‌స్పాన్ లయన్స్, అపోలో గ్యాస్ట్రో అవెంజర్స్, నీతి మాలాస్ వారియర్స్ టిగోన్స్, సూర్యపేట్ క్రుసాడర్స్, సన్‌షైన్ స్పార్టాన్స్ జట్ల యజమానులు, కెప్టెన్లను ఎమ్మెస్కే ప్రసాద్ సమక్షంలో పరిచయం చేసి, జట్ల లోగోలను కూడా విడుదల చేశారు. ఈ లీగ్‌లో పోటీ పడేందుకు హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణె, జైపూర్, బెంగళూరు నగరాలకు నుంచి సైతం 160 మంది డాక్టర్లు రిజిష్టర్ చేసుకున్నారని ఎమ్మెస్కే తెలిపారు. ఈ నెల 20వ నిర్వహించే వేలంలో ప్రతి జట్టు 15 మంది ఆటగాళ్లను తీసుకోనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, డ్రీమ్జ్ లెవెన్ స్పోర్ట్స్ సీఈఓ అనిల్ పెండెల తదితరులు పాల్గొన్నారు.