Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్‌వెల్స్ నుంచి ఔట్
ఇండియన్‌వెల్స్ : నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, మహిళల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 నవొమి ఒసాక కంటతడి పెట్టింది. మానసిక ఆరోగ్య కారణాలతో కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న ఒసాక.. తాజాగా ఇండియన్‌వెల్స్ ఓపెన్‌లో బరిలోకి దిగింది. ఒసాకను ఉద్దేశించి అక్కడ ఓ అభిమాన అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. అసభ్యకర మాటలతో మానసికంగా కుంగిన ఒసాక.. రాకెట్‌తో పెద్దగా రాణించలేదు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 0-6, 4-6తో వెరోనికా చేతిలో పరాజయం పాలైంది. 'నాపై గతంలోనూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నేనేమి పెద్దగా బాధపడలేదు. గతంలో సెరెనా, వీనస్ విలియమ్స్పైనా ఇక్కడ జాతి వివక్ష వ్యాఖ్యలు చేవారు. ఇక్కడికి రావటానికి ముందు భావోద్వేగంగా ఎంతో బాగున్నాను' అని బాధపడుతూనే ఒసాకా మాట్లాడింది.