Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ పోరాడి ఓడిన యువ షట్లర్
- జర్మనీ ఓపెన్ బ్యాడ్మింటన్
బెర్లిన్ : భారత బ్యాడ్మింటన్ యువ కెరటం, వరుస విజయాలతో దూసుకెళ్తోన్న లక్ష్యసేన్ మరో టైటిల్‌కు తృటిలో చేజార్చుకున్నాడు. జర్మనీ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో థారులాండ్ షట్లర్‌తో వరుస గేముల్లో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు. టైటిల్ పోరు వరకు అద్భుత ఆట తీరు కనబరిచిన లక్ష్యసేన్.. తుది అడుగు తడబడ్డాడు. 57 నిమిషాల ఫైనల్లో వరల్డ్ నం.20 కునావిట్ విటిడ్‌శరణ్ పైచేయి సాధించాడు. వరల్డ్ నం.12 లక్ష్యసేన్‌తో ముఖాముఖి పోరులో 3-3తో సమవుజ్జీగా బరిలోకి దిగిన థారులాండ్ కుర్రాడు.. ఫైనల్లో అంచనాలకు అందలేదు. టైటిల్ ఫేవరేట్‌గా కోర్టులోకి అడుగుపెట్టిన లక్ష్యసేన్ ఆరంభం నుంచీ వెనుకంజలోనే నిలిచాడు. 4-4, 5-5 వరకు పోటీనిచ్చినా.. విరామ సమయానికి 6-11తో ఐదు పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు. ద్వితీయార్థంలోనూ థారులాండ్ షట్లర్‌ను లక్ష్యసేన్ అందుకోలేదు. చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో గేమ్‌లోనూ లక్ష్యసేన్ అనూహ్యంగా నిరాశపరిచాడు. 11-16తో ఆధిక్యం కోల్పోయిన లక్ష్యసేన్ చివర్లో ఏం చేయలేకపోయాడు. వరుస గేముల్లో గెలుపొందిన థారు షట్లర్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో సహచర చైనా షట్లర్ చెన్ యుఫెరుపై 21-14, 27-25తో హీ బింగ్జియావ్ ఉత్కంఠ విజయం సాధించింది.