Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత జట్టులో తెలంగాణ బాక్సర్
హైదరాబాద్ : ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, మాజీ జూనియర్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో పంచ్ విసిరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చైనాలో జరుగనున్న 2022 ఆసియా క్రీడలకు నిర్వహించిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ సత్తా చాటింది. మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ టాప్ లేపింది. మహిళల 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ చోటు సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్స్ సిల్వర్ మెడలిస్ట్ మంజు రాణిపై నిఖత్ జరీన్ పైచేయి సాధించగా.. రైల్వేస్ బాక్సర్ పూజపై బొర్గొహైన్ గెలుపొందింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10-25న ఆసియా క్రీడలకు జరుగనున్నాయి. గత వారం ఇంధిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ ఎంపిక ట్రయల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గొహైన్‌లు తాజాగా ఆసియా క్రీడలకు సైతం భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. మనీశ (57 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), స్వీటీ బూర (75 కేజీలు) సైతం ఆసియా క్రీడల భారత బాక్సింగ్ జట్టులో నిలిచారు.