Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో థాయ్‌లాండ్‌పై ఘన విజయం
- ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత
- నవ చరిత్రకు ఇది నాంది: హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్ రావు
హైదరాబాద్ : భారత హ్యాండ్‌బాల్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. భారత అమ్మాయిలు ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్లుగా అవతరించారు. కజకిస్థాన్ వేదికగా జరిగిన 16వ ఆసియా జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో టీమ్ ఇండియా తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. సోమవారం నాటి టైటిల్ పోరులో థారులాండ్‌పై భారత్ భారీ విజయం నమోదు చేసింది. భారత అమ్మాయిల జోరు నడిచిన తుది సమరంలో 41-18తో టీమ్ ఇండియా టైటిల్ సాధించింది. మ్యాచ్ ప్రథమార్థంలోనే 20-09తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన భారత్.. ద్వితీయార్థంలోనూ దూకుడు తగ్గలేదు. యువ క్రీడాకారిణి భావన శర్మ టోర్నీ ఉత్తమ ప్లేయర్, ఉత్తమ సెంటర్ బ్యాక్ ప్లేయర్ అవార్డులు అందుకుంది. చేతన శర్మ ఉత్తమ గోల్‌కీపర్‌గా నిలిచింది. తొలిసారి ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత్.. ప్రపంచ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించింది.
అద్వితీయ ప్రదర్శన. సరికొత్త చరిత్ర లిఖించ బడింది. అమ్మాయిల ప్రదర్శన పట్ల భారత్ గర్వపడుతోంది. ఆసియా జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ చాంపియన్‌గా నిలువటం ఇదే తొలిసారి. ప్రపంచ చాంపియన్ షిప్స్‌కు అర్హత సాధించటం సైతం ఇదే ప్రథమం. అమ్మాయిల విజయం పట్ల ఎంతో గర్వపడుతున్నాను'.
- అరిశనపల్లి జగన్మోహన్ రావు
జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు