Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 238 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
- మూడు రోజుల్లోనే చేతులెత్తేసిన శ్రీలంక
- 2-0తో టెస్టు సిరీస్ భారత్ వశం
మళ్లీ మూడు రోజుల్లోనే ముగిసింది లాంఛనం!. పింక్ బాల్ టెస్టులో టీమ్ ఇండియాకు కాస్త ప్రతిఘటన ఇచ్చేందుకు లంకేయులు విశ్వ ప్రయత్నం చేసినా.. బెంగళూర్ టెస్టును నాల్గో రోజుకు తీసుకెళ్లలేకపోయారు. ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/55) నాలుగు వికెట్ల ప్రదర్శనతో మ్యాజిక్ చేయగా 447 పరుగుల రికార్డు ఛేదనలో శ్రీలంక 208 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నె (107) శతకంతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. 238 పరుగుల భారీ తేడాతో భారత్ రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. 2-0తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది వరుసగా (మూడు ఫార్మాట్లలో కలిపి) నాల్గో క్లీన్‌స్వీప్ సిరీస్ విజయం కావటం విశేషం.
నవతెలంగాణ-బెంగళూర్
టీమ్ ఇండియా దండయాత్ర కొనసాగుతోంది. టెస్టుల్లో టీమ్ ఇండియా ముందు శ్రీలంక తేలిపోయింది. వరుసగా రెండో టెస్టును మూడు రోజుల్లోనే కోల్పోయింది. బెంగళూర్ డే నైట్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య భారత్ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దిముత్ కరుణరత్నె (107, 174 బంతుల్లో 15 ఫోర్లు) శతకం, కుశాల్ మెండిస్ (54, 60 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ శతకంతో పోరాడే ప్రయత్నం చేశారు. కొండంత లక్ష్య ఛేదనలో కరుణరత్నె, కుశాల్ మెండిస్ పోరాటం ఏ మాత్రం సరిపోలేదు. 59.3 ఓవర్లలో 208 పరుగులకే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/55) నాలుగు వికెట్ల ప్రదర్శన చేయగా.. జశ్‌ప్రీత్ బుమ్రా (3/27), అక్షర్ పటేల్ (2/37) రాణించారు. 2-0తో టెస్టు సిరీస్ టీమ్ ఇండియా కైవసం అయ్యింది. మొహాలి, బెంగళూర్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ గతిని మార్చిన రిషబ్ పంత్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలువగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలు సాధించిన శ్రేయస్ అయ్యర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
రెండు సెషన్లలోనే..! : ఓవర్‌నైట్ స్కోరు 28/1తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక.. పోరాటం ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్ దిముత్ కరుణరత్నె (107), నం.3 బ్యాటర్ కుశాల్ మెండిస్ (54) ఆశల్లేని ఛేదనలో గొప్ప పోరాట పటిమ ప్రదర్శించారు. ఆరు ఫోర్లతో 92 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కరుణరత్నె..14 ఫోర్ల సాయంతో 168 బంతుల్లో వంద మార్క్ చేరుకున్నాడు. మరో ఎండ్‌లో కుశాల్ మెండిస్ ఏడు ఫోర్లతో 57 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. ఈ ఇద్దరూ క్రీజులో ఉండగా శ్రీలంక మెరుగ్గా కనిపించింది. తొలి సెషన్లో మెండిస్ సహా ఎంజెలో మాథ్యూస్ (1), ధనంజయ డిసిల్వ (4) వికెట్లతో భారత్ గెలుపును నల్లేరుపై నడకను చేసుకుంది. కరుణరత్నె, మెండిస్ మినహా శ్రీలంక బ్యాటర్లలో ఎవరూ రాణించలేదు. టీ విరామ సమయానికి శ్రీలంక 151/4తో నిలిచింది.
రెండో సెషన్లో భారత బౌలర్లు ఎక్కువ సేపు నిరీక్షించలేదు. శతకం అనంతరం కరుణరత్నె నిష్క్రమించగానే శ్రీలంక పతనం లాంఛనమైంది. ఆ జట్టు చివరి నాలుగు వికెట్లను నాలుగు పరుగులకే కోల్పోయింది. 204/7తో ఉన్న శ్రీలంక 208/10కే ఆలౌట్ అయ్యింది. చివరి వికెట్ పడగొట్టిన అశ్విన్.. భారత్‌కు 22వ సారి చివరి వికెట్ తీసి విజయాన్ని అందించిన ఘనతను అందుకున్నాడు. షేన్ వార్న్ ఆస్ట్రేలియాకు నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. రతొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధించింది. కరుణరత్నె, మెండిస్ మినహా మిగతా బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 252/10
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 109/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్డ్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : లహిరు తిరిమానె (ఎల్బీ) బుమ్రా 0, దిముత్ కరుణరత్నె (బి) బుమ్రా 107, కుశాల్ మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 54, ఎంజెలో మాథ్యూస్ (బి) జడేజా 1, ధనంజయ డిసిల్వ (సి) విహారి (బి) అశ్విన్ 4, నిరోశన్ డిక్వెల్లా (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12, చరిత్ అసలంక (సి) రోహిత్ (బి) అక్షర్ 5, లసిత్ ఎంబుల్డెనియ (ఎల్బీ) అశ్విన్ 2, సురంగ లక్మల్ (బి) బుమ్రా 1, విశ్వ ఫెర్నాండో (సి) మహ్మద్ షమి (బి) అశ్విన్ 2, ప్రవీణ్ జయవిక్రమ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు :20, మొత్తం :(59.3 ఓవర్లలో ఆలౌట్) 208.
వికెట్ల పతనం : 1-0, 2-97, 3-98, 4-105, 5-160, 6-180, 7-204, 8-206, 9-208, 10-208.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 9-4-23-3, మహ్మద్ షమి 6-0-26-0, రవిచంద్రన్ అశ్విన్ 14-2-48-1, అక్షర్ పటేల్ 11-1-37-2.
క్రికెటర్‌గా ఎదగాలని ఉంటుంది. గతంలో కొన్ని పొరపాట్లు చేశాను. కానీ నన్ను నేను మెరుగుపర్చుకోవాలని అనుకున్నాను. నా మైండ్‌సెట్ గతంలో మాదిరిగా లేదు. ఇక్కడ పిచ్ క్లిష్టంగా ఉంది, ఆరంభం నుంచే ఎదురుదాడి చేయాలని అనుకున్నాను. వికెట్ కీపింగ్ ఆత్మవిశ్వాసానికి సంబంధించింది. గతంలో ఏమైనా మిస్ చేస్తాననే ఆలోచనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రక్రియపైనే పూర్తిగా దృష్టి నిలిపాను'
- రిషబ్ పంత్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ నా సహజ శైలి కాదు. ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడటం చూసి, ఎదురుదా చేయాలని నిర్ణయించుకున్నాను. శతకం చేజారిందనే బాధ ఏమాత్రం లేదు. రెండో ఇన్నింగ్స్‌లో మాకో టార్గెట్ ఉంది. దాని ప్రకారమే ఆడాను. భారత టెస్టు క్రికెటర్‌గా దిగ్గజాల సరసన ఆడాలని స్వప్పించేవాడిని. ఈ నిలకడ రానున్న టెస్టుల్లోనూ కొనసాగిస్తాననే నమ్మకం ఉంది'
- శ్రేయస్ అయ్యర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్