Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఇంగ్లాండ్‌తో భారత్ ఢ
- ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్
మౌంట్ మౌంగనురు : మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో లీగ్ దశలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న టీమ్ ఇండియా.. నేడు కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో దెబ్బతిన్న మిథాలీసేన.. వరుస పరాజయాలతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన ఇంగ్లాండ్‌ను ఎదుర్కొనుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో పాయింట్ల ఖాతా తెరువలేదు. మరోవైపు వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించిన భారత్ నేడు ఇంగ్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా ఆడనుంది. భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ ఉదయం 6.30 గంటలకు ఆరంభం కానుంది.
రెట్టించిన ఉత్సాహం : భారత శిబిరం రెట్టించిన ఉత్సాహంలో ఉంది. స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు శతకాలతో చెలరేగటంతో బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలంగా తయారైంది. మిడిల్ ఆర్డర్లో మిథాలీరాజ్ ఇంకా ఫామ్ అందుకోవాల్సి ఉండగా.. కీలక మ్యాచ్‌కు యువ షెఫాలీ వర్మకు మరో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీప్తి శర్మ సైతం నిలకడగా రాణిస్తోంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ స్టార్ బ్యాటర్లు అంచనాల మేరకు రాణిస్తే లీగ్ దశలో మూడో విజయం లాంఛనమే కానుంది. బౌలింగ్ విభాగంలో వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి తోడు పూజ, స్నేV్‌ా రాణా, రాజేశ్వరిలు వికెట్ల వేటలో ముందుంటున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ బలంగా పుంజుకోవాలని చూస్తుంది. భారత్‌తో గత ఐదు మ్యాచుల్లో మూడింట గెలుపొందిన ఇంగ్లాండ్.. నేడు దూకుడుగా ఆడే అవకాశం కనిపిస్తోంది. టామీ బ్యూమోంట్, నటాలీ సీవర్, కేట్ క్రాస్, సోఫీ ఎకెల్స్టోన్లు ఇంగ్లాండ్ తరఫున కీలకం కానున్నారు. బంతితో, బ్యాట్‌తో ఈ నలుగురిని నియంత్రిస్తే భారత్‌కు విజయం సులువే.