Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ క్యాపిటల్స్ నియామకం
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వీరోచిత ఇన్నింగ్స్‌లతో అలరించిన షేన్ వాట్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్ బై పలికిన షేన్ వాట్సన్ తొలిసారి కోచింగ్ బృందంలో భాగం కానున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షేన్ వాట్సన్ సహాయక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చీఫ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అజిత్ అగార్కర్ (అసిస్టెంట్ కోచ్), ప్రవీణ్ ఆమ్రె (అసిస్టెంట్ కోచ్), జేమ్స్ హోప్స్ (బౌలింగ్ కోచ్)లతో పాటు షేన్ వాట్సన్ అసిస్టెంట్ కోచ్‌గా కొనసాగనున్నాడు. పొట్టి ఫార్మాట్లో విశేష అనుభవం కలిగిన షేన్ వాట్సన్ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడిన అనుభవం గడించాడు. ఐపీఎల్, బిబిఎల్, పిఎస్‌ఎల్‌లో షేన్ వాట్సన్ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి ఐపీఎల్ ముద్దాడాడు. ' ఢిల్లీ క్యాపిటల్స్‌కు గొప్ప జట్టు ఉంది. తొలి ఐపీఎల్ గెలిచేందుకు ఇదే సరైన సమయం. కుర్రాళ్లలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తొలి టైటిల్ నెగ్గేందుకు నా శక్తి మేరకు పని చేస్తాను' అని షేన్ వాట్సన్ ఓ ప్రకటనలో తెలిపాడు.