Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా సన్మానించిన హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపిరున్షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. న్యూఢిల్లీలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం భారత హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండేలు భారత హ్యాండ్‌బాల్ జట్టుతో ఓం బిర్లాను కలిశారు. ఇదే ఉత్సాహంతో రానున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సైతం పతకం సాధించాలని క్రీడాకారిణులకు స్పీకర్ సూచించారు. అంతకముందు, ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన అమ్మాయిల జట్టును కర్నాల్ సింగ్ స్టేడియంలో భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఘనంగా సన్మానించారు. 'ఏడాది పాటు చేసిన కషికి ఫలితం దక్కింది. పసిడి వేటలో జట్టు సమిష్టిగా రాణించింది. ఈ విజయం స్ఫూర్తితో సీనియర్ జట్లు సైతం మంచి ప్రదర్శన చేయాలని' హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ అన్నారు.కజకిస్థాన్‌లో జరిగిన ఆసిసియా జూనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది స్లోవేనియాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు తొలిసారి పోటీపడనుంది.