Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్దిక్ పాండ్యకు ఎన్సీఏ గ్రీన్ సిగల్
బెంగళూర్ : తరచుగా గాయాల బారిన పడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఈ సీజన్ ఐపీఎల్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగల్ లభించింది. కొత్త ప్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించనున్న హార్దిక్ పాండ్య బుధవారం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యాడు. ఎన్సీఏలో సౌకర్యవంతంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్య.. జాతీయ జట్టు ప్రామాణిక ఫిట్నెస్ పరీక్ష యోయో టెస్టులో సైతం పాసయ్యాడు. వార్షిక కాంట్రాక్టు కలిగిన క్రికెటర్లకు బీసీసీఐ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రాంఛైజీలు ఈ విషయంలో బోర్డుపై అసంతృప్తిగా ఉన్నాయనే వార్తలు సైతం వస్తున్నాయి. 'గాయాల నుంచి కోలుకున్న క్రికెటర్లకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు. హార్దిక్ విషయంలో సాధారణ ఫిట్నెస్ పరీక్షలు చేశారు. ఎన్సీఏలో అతడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయినా, ఆకట్టుకునే వేగంతో నిలకడగా అతడు బంతులేశాడు. యోయో టెస్టులో 17 ప్లస్ స్కోరు సాధించాడు' అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
పృథ్వీ షా ప్లాప్? : యువ క్రికెటర్ పృథ్వీ షా ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. అండర్-19 ప్రపంచకప్ విజయ సారథి గత కొన్నాండ్లుగా భారత జట్టుకు దూరమయ్యాడు. వార్షిక కాంట్రాక్టు జాబితాలో పృథ్వీ షా లేడు. అయినా, యో యో టెస్టులో పృథ్వీ 15 స్కోరు మాత్రమే సాధించినట్టు తెలుస్తోంది. కనీసం 16.5 సాధిస్తేనే ఫిట్నెస్ టెస్టులో నెగ్గినట్టు. ఐపీఎల్లో ఆడేందుకు పృథ్వీ షాను ఇది ఆపలేదు. అయినా, యువ క్రికెటర్ ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ద వహిస్తే భవిష్యత్‌లో జాతీయ జట్టులోకి రాగలడు. జాతీయ జట్టులో చోటుకు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గటం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.