Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంధుల ముక్కోణపు టీ20 టోర్నీ
దుబాయ్: ఓపెనర్ వెంకటేశ్వర్ రావు (62 బంతుల్లో 91బీ 9 ఫోర్లు) అదరగొట్టడంతో.. ముక్కోణపు టీ20 టోర్నీలో భారత అంధుల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' వెంకటేశ్వర్ రావు 9 బౌండ్రీల సాయంతో 62 బంతుల్లోనే 91 పరుగులు సాధించడం విశేషం. అనంతరం భారీ లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లు ముగిసేసరికి 122/6తో నిలిచింది. ఈ విజయంతో తుదిపోరుకు అర్హత సాధించిన భారత్.. శనివారం జరుగనున్న ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడనుంది.