Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: త్వరలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలకు టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను సిద్ధమవుతున్నది. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ప్రపంచ మాజీ చాంపియన్ మీరాబాయి అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నది. దీనికోసం వెయిట్ లిఫ్టింగ్ ప్రధాన కోచ్ విజరు శర్మతో కలిసి సెయింట్ లూయిస్‌కు చాను చేరుకుంది. వీసాల ఆలస్యంతో భారత వెయిట్‌లిఫ్టర్లు జెరెమి లాల్రిన్నుంగ, అచింత షేలీ, సంకేత్ సాగర్, బింద్యారాణి దేవి, జిలి దలబెహర ఆగిపోయారు. వీసాలు వచ్చాక వారు కూడా శిక్షణ కోసం యూఎస్ఏ వెళ్లనున్నారు. 'నాలుగు-ఐదు వారాల పాటు అక్కడ ఉండాలని అనుకున్నాం. ఈ గడువు మరికొంత పెరిగే అవకాశం ఉంది. వీసాల ప్రక్రియ ముగియగానే మిగతా వెయిట్‌లిఫ్టర్లు అమెరికాకు రానున్నారు' అని కోచ్ విజరుశర్మ తెలిపారు.