Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫుకెట్: ఆర్చరీ ఆసియా కప్‌లో భారత్‌కు ఆరు పతకాలు ఖరారయ్యాయి. వ్యక్తిగత ఈవెంట్లో నిరాశపర్చిన భారత ఆర్చర్లు టీమ్ ఈవెంట్లో అదరగొట్టారు. రికర్వ్ మహిళల విభాగంలో నాలుగో సీడ్ తిష పూనియా మలేసియా ఆర్చర్ నాఫోజితో కాంస్యం కోసం తలపడనుంది. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుష త్రయం సోలంకి, ధీరజ్, రాహుల్ కుమార్ నగర్వాల్ కజకిస్థాన్‌తో పోరాడనుంది. మొదటి రౌండ్ బై లభించడంతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత బందం మలేసియాతో పోరాడనుంది. రికర్వ్ మహిళల టీమ్ ఈవెంట్లో టాప్ సీడ్ భారత బందం రిధి, తిష, తానిషా వర్మ 6-2 (56-57, 53-50, 50-39, 55-46)తో థాయిలాండ్ జట్టును చిత్తు చేసింది. పసిడి పతకం కోసం బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. కాంపౌండ్ ఈవెంట్లో రెండో సీడ్ రిషబ్ యాదవ్ 148-144తో నవాజ్ రకిబ్ను, 148-145తో సయేద్ కౌసర్‌ను ఓడించి స్వర్ణ పతక పోరుకు దూసుకెళ్లాడు. మహిళల కాంపౌండ్‌లో పర్ణీత్ కౌర్ ఫైనల్ చేరగా.. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో ప్రథమేశ్ జాకర్ కాంస్యం ఖరారు చేసుకున్నాడు. పురుషులు, మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో భారత్ ఫైనల్ చేరింది.