Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల డబుల్స్‌లో గాయత్రి-జోలీ సంచలనం
- పురుషుల డబుల్స్‌లో నిరాశ
- ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
లండన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్ లక్ష్యసేన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... పురుషుల డబుల్స్‌లో భారత జోడీకి నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్ధి లూ-జంగ్-జూ గాయంతో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ దూరంగా ఉన్నాడు. దీంతో లక్ష్యసేన్ క్వార్టర్స్ మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో లక్ష్యసేన్.. 2వ సీడ్ కెంటో మొమొటో- 6వ లీ-జిల్-జియా(అమెరికా) మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు. ఇక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రీసా జోలీ జంట 14-21, 22-20, 21-15తో 2వ సీడ్ కొరియాకు చెందిన లీ-సోహీ, షిన్ షోచన్(కొరియా)పై సంచలన విజయం సాధించి సెమీస్‌కు చేరారు. సెమీస్‌లో మహిళల జోడీ చైనాకు చెందిన షూ-షియాన్, జంగ్ యులతో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్త్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ఫైనల్లో ఓటమిపాలైంది. సాత్త్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 22-24, 17-21తో టాప్‌సీడ్ మార్కస్-కెవిన్(ఇండోనేషియా) చేతిలో ఓడారు.