Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఆస్ట్రేలియాతో ఢ
- ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్
- ఉ.6.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
ఆక్లాండ్: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ సేన మరో కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. విండీస్, పాకిస్తాన్‌పై గెలిచిన మిథాలీ సేన.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే నేడు పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమిండియా ఇంకా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. ఓటమి ఎరుగకుండా టోర్నీలో దూసుకెళ్తున్న ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుర్బేధ్యఫామ్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు 4 మ్యాచుల్లో గెలిచి 8 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. వెస్టిండీస్జట్టు తాజాగా బంగ్లాదేశ్‌పై విజయం సాధించి 3వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత సమీకరణల బట్టి సెమీస్‌కు చేరే మిగిలిన రెండు బెర్త్‌లకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో మిథాలీసేనకు ప్రతి మ్యాచ్‌లో విజయం కీలకం కానుంది.
ఉత్కంఠపోరులో విండీస్ గెలుపు
మౌంట్ ముఘనారు వేదికగా శుక్రవారం జరిగిన పోటీలో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టును ఓపెనర్లు డియేండ్ర డాటిన్(17 పరుగులు), హేలీ మ్యాథ్యూస్(18 పరుగులు) శుభారంభం అందించినా.. విలియమ్స్(4), కెప్టెన్ టేలర్(4) సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. జట్టు ఉన్న దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ 107 బంతుల్లో 53 పరుగులు చేసింది. దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లాజట్టు చివరి ఓవర్ వరకు పోరాడింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా.. బంగ్లాచేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. తొలి బంతికి రెండు, రెండో బంతికి సింగిల్ వచ్చినా.. మూడో బంతికి ఫరీహా ఔట్ కావడంతో బంగ్లా విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాథ్యూస్‌కు లభించింది.