Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి 50వ జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ మొదలుకానుంది. టోర్నీ పోస్టర్‌ను ఆదివారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన కార్యాలయంలో జగన్మోహన్రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. స్థానిక సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంతో పాటు ఎల్బీనగర్ లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వేదికలుగా టోర్నీ జరుగుతుందని జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తెలిపారు. ఈ పోటీల్లో దాదాపు 30 జట్లు పాల్గొనే అవకాశముందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పోటీలను విజయవంతంగా నిర్వహిస్తామని జగన్మోహన్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.