Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్లాండ్: వన్డే మహిళల ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలను సజీవం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఒక వికెట్ తేడాతో ఓడించి ఇంకా రేసులో నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లకు 203 పరుగులు చేసి కుప్పకూలింది. మాడీ గ్రీన్ (52), సోఫీ డివైన్ (41) రాణించగా.. కేట్ క్రాస్, సోఫీ ఎకల్ట్సన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 204/9 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' నాట్ సివర్ (61) అర్ధ శతకంతో అదరగొట్టగా.. ఫ్రాన్సెస్ మాకె నాలుగు వికెట్లతో విజంభించినా.. న్యూజిలాండ్ హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది.