Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్ వరకు నెలవారీ నగదు ప్రోత్సాహం
హైదరాబాద్: వరల్డ్ చాంపియనషిప్స్, ఆసియా క్రీడలకు ఎంపికైన భారత స్టార్ బాక్సర్.. తెలుగమ్మాయి నిఖత్ జరీన్‌ను మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఘనంగా సత్కరించారు. సోమవారం ఎంఎల్ఆర్ఐటీలోని ఇండోర్ స్టేడియంలో ఆ సంస్థ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంటరీ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి నిఖత్‌ను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిఖత్ తమ కళాశాల ఎంబీఏ విద్యార్థి కావడం గర్వంగా ఉందన్నారు. పట్టుదల, కఠోర సాధన లేనిదే ఈ స్థాయికి రాలేరని.. నిఖత్‌ను ఆదర్శంగా తీసుకొని మరింత మంది క్రీడాకారులు కళాశాల నుంచి తయారు కావాలని ఆకాంక్షించారు. ఈనెల నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు నిఖత్‌కు ఎంఎల్ఆర్ఐటీ తరఫున ప్రతినెల రూ.20 వేలు నగదు ప్రోత్సాహం అందించనున్నామని మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఆమె అడ్వాన్సడ్ కోచింగ్ తీసుకోవడానికి, శిక్షణ సంబంధిత ఇతరత్రా ఖర్చులకు వినియోగించుకోవడానికి ఈ సాయం చేస్తున్నట్టు మర్రి తెలిపారు.