Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్
బెంగళూరు: మన్దీప్ సింగ్ అద్భుత ఆటతో భారత హాకీజట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ సంచలన విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన పోటీలో భారత్ 2016 ఒలింపిక్స్ హాకీ విజేత అర్జెంటీనాకు షాకిచ్చింది. కళింగ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు తొలుత 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో పుంజుకున్న అర్జెంటీనా వరుసగా రెండో గోల్స్ చేసింది. ఆ తర్వాత భారత్ మరో గోల్ చేసినా.. రివ్యూలో భారత ఆటగాళ్లు సర్కిల్లోనే బాల్ కలెక్ట్ చేసినట్లు తేలడంతో ఆ గోల్‌ను వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత ఇరుజట్లు ఒక్కో గోల్ కొట్టడంతో 3-3తో రెండు జట్లూ సమానంగా నిలిచాయి. మ్యాచ్ ముగియడానికి అయితే ఆట ముగియడానికి 26సెకన్లు ఉందనగా.. జుగ్రాజ్ సింగ్ నుంచి బంతిని అందుకున్న మన్దీప్ సింగ్ అద్భుతమైన టచ్‌తో గోల్ చేశాడు. దీంతో మ్యాచ్ ముగిసే సరికి భారత జట్టు 4-3తో విజయం సాధించింది. భారత డిఫెండర్ వరుణ్ కుమార్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ టోర్నీలో భాగంగా జరిగిన రెండు మ్యాచుల్లో రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు గెలుపొంది 2-2తో నిలిచాయి.