Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బంగ్లాదేశ్‌తో ఢ
- ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్
- ఉ.6.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
హామిల్టన్: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ సేన నేడు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సెడెన్పార్క్ వేదికగా భారతజట్టు మంగళవారం జరిగే పోటీలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. వెస్టిండీస్ జట్టు సోమవారం జరిగిన పోటీలో అనూహ్యంగా పాకిస్తాన్ చేతిలో ఓటమి మిథాలీసేనకు కలిసొచ్చిందని చెప్పుకోవాలి. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై సంచలన విజయాలతో దుర్భేధ్య ఫామ్‌లో ఉన్న విండీస్ జట్టు టోర్నీలో గెలుపు రుచి చూడని పాక్ చేతిలో ఓడడం విశేషం. దీంతో ఆఖరి మ్యాచ్‌లో విండీస్ జట్టు పటిష్ట దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే.. విండీస్ సెమీస్ ఆశలు మూసుకుపోయినట్లే. ఇక భారతజట్టు నేటి మ్యాచ్‌లో గెలుపొందితే భారత్ ఖాతాలో 6పాయింట్లు ఉండనున్నాయి. రన్‌రేట్ పరంగా భారత్.. విండీస్‌కంటే మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో నేడు మిథాలీసేన బంగ్లాదేశ్‌పై భారీ రన్‌రేట్‌పై దృష్టి సారింది.
13ఏళ్ల తర్వాత పాక్‌కు తొలి గెలుపు
మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు బోణీ కొట్టింది. హామిల్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో గెలిచి 13ఏళ్ల తర్వాత ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు 2009లో పాకిస్తాన్ జట్టు తొలిసారి విజయం సాధించింది. వర్షం కారణంగా 20ఓవర్లకు జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 89 పరుగుల మాత్రమే చేయగల్గింది. పాక్ స్పిన్నర్ నిదా దార్ కేవలం 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ డాటిన్(27) మాత్రమే రాణించింది. అనంతరం పాక్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మునీబా అలీ(37), కెప్టెన్ మహారూప్(20) పరుగులతో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిదా దార్‌కు లభించింది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 18మ్యాచుల్లో ఓటమి తర్వాత తొలి విజయాన్ని పాక్ సొంతం చేసుకుంది.