Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్ భవన్లో మాకు హక్కు ఉంది
- ఏపీఓఏ కార్యదర్శి ఆర్.పురుషోత్తం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) వివాదాలు పరిష్కారమవడంతో హైదరాబాద్లోని ఉమ్మడి ఏపీ ఒలింపిక్ సంఘం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఏపీఓఏ ప్రధాన కార్యదర్శి ఆర్.కే పురుషోత్తం అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒలింపిక్ భవన్లో ఏపీఓఏకు హక్కు ఉందని పురుషోత్తం వెల్లడించారు. ఐఓఏ 2017లో ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కష్ణదాస్ అధ్యక్షతన ఉన్న తమ సంఘానికి గుర్తింపునిస్తూ ఈనెల 15న తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పును గౌరవిస్తూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమ అధికారిక వెబ్సైట్లో అధ్యక్షుడిగా కష్ణదాస్ పేరును పొందుపర్చింది. ఆర్బిటేషన్ తీర్పును సవాల్ చేయాలనుకుంటే స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్లో కౌంటర్ చేయాలని జస్టిస్ బి.సి కందాపాల్ నేతత్వంలోని ట్రిబ్యునల్ తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రానున్న ఐఓఏ ఎన్నికల్లో ఓటర్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఓఏ ప్రతినిధులే పాల్గొంటారు. పురుషోత్తం. ఒలింపిక్ భవన్ నిర్మాణాన్ని పూర్తిగా ఏపీఓఏ నిధులతో చేపట్టారు. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలకు భాగం ఉంది. ఏపీకి 52 శాతం, తెలంగాణకు 48 శాతం వాటా రావాలి. వివిధ బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, ఒలింపిక్ భవన్ లోని కొంత భాగాన్ని అద్దెకు తీసుకున్న జీఎస్టీ విభాగం వారు 2015 నుంచి చెల్లించాల్సిన కిరాయి మొత్తం కలిసి దాదాపు రూ.1.30 కోట్లు ఏపీఓఏ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) మధ్య పంపకాలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన నోటీసులను టీఓఏ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్కు అందించాం. త్వరలోనే తెలంగాణ ఒలింపిక్ సంఘం అధికారులతో భేటీ అవుతాం.చట్టబద్ధంగా ఏపీఓఏకు రావాల్సినవి ఎవరైనా అడ్డుకుంటే న్యాయపోరాటం చేస్తామని' పురుషోత్తం పేర్కొన్నారు.