Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన
మెల్బోర్న్: మహిళల టెన్నిస్ టాప్‌సీడ్ క్రీడాకారిణి ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన చేసింది. తాను అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఆస్ట్రేలియా తరఫున మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచిన బార్టీ.. తాజాగా 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ కూడాను. ''నేను టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించినందున భావోద్వేగానికి గుర య్యాను. ఈ వార్తలను మీతో ఎలా పంచుకోవాలో నాకు తెలియడం లేదు. కాబట్టి నాకు సహాయం చేయమని నా స్నేహితుడిని అడిగాను. ఈ క్రీడలో ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. నాకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అని 25ఏండ్ల బార్టీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపింది. బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు బార్టీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది.