Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి జట్టుకు రెండు అప్పీల్స్ చేసుకొనే అవకావం
- ప్రేక్షకుల సమక్షంలోనేఈ సీజన్ ఐపిఎల్ : బిసిసిఐ
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15లో అదనపు డెసిషన్ రివ్యూ సిస్టమ్(డిఆర్ఎస్)కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ఓకే చెప్పింది. అలాగే 25% ప్రేక్షకుల సమక్షంలోనే ఈ సీజన్ ఐపిఎల్‌కు జరగనున్నట్లు మరో ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రతి జట్టుకు అదనంగా మరో డిఆర్ఎస్ అప్పీల్‌ను ఎంచుకొనే అవకాశం దక్కనుంది. అంటే.. ప్రతి జట్టు తన ఇన్నింగ్స్‌లో అంపైర్ల నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ రెండుసార్లు డిఆర్ఎస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. రెండూ నెగెటివ్ వస్తే మూడోసారి ఆ అవకాశం ఆ జట్టుకు లభించదు. ఇక పాజిటివ్ వస్తే మాత్రం ఆ డిఆర్ఎస్లు అలానే కొనసాగుతూ ఉంటాయి. తాజాగా బిసిసిఐ తీసుకున్న మరో నిర్ణయం ఐపిఎల్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియం సామర్థ్యాన్ని బట్టి 25% ప్రేక్షకులను అనుమతించడం. శనివారం వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లమధ్య జరిగే తొలి పోటీతో ఈ సీజన్ ఐపిఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిసిసిఐ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్వాగతించాడు. యుఏఇ వేదికగా గత ఏడాది జరిగి సీజన్-14 ఐపిఎల్ ప్రేక్షకుల్లేకుండానే జరిగిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 ఆ తర్వాత పరిస్థితులను బట్టి ప్రేక్షకుల పెంపు, ఇతరత్రా వాటిపై మరోసారి నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు ఆ ప్రకటనలో తెలిపారు. 25% ఆక్యుపెన్సీతో ముంబయి, నవీ ముంబయి, పూణేలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. వాంఖడే స్టేడియంలో అత్యధిక మ్యాచ్‌లు, ఆ తర్వాత డివై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియంలలో 20మ్యాచ్‌లు, ఎంసిఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 15మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే.