Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసిసి) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి టాప్‌ర్యాంక్‌కు చేరాడు. 385 పాయింట్లతో జడేజా తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(357 పాయింట్లు) ఉన్నాడు. ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో రాణించిన జడేజా మార్చి రెండో వారంలో విడుదల చేసిన టెస్టు ఆల్‌రౌండర్స్ విభాగంలో తొలిసారి టాప్‌లో నిలిచాడు. ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను విండీస్ ఆల్‌రౌండర్ హోల్డర్‌కు కోల్పోయాడు. తాజాగా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచిన జడేజా... హోల్డర్‌కు మధ్య దాదాపు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. మరో రెండు నెలల పాటు ఎలాంటి టెస్టు సిరీస్‌లు లేకపోవడంతో జడేజా కొన్నాళ్ల పాటు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇక రవిచంద్రన్ అశ్విన్(341 పాయింట్లు) మూడోస్థానంలో ఉన్నాడు. బ్యాటర్స్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం 799 పాయింట్లతో ఆరోస్థానానికి ఎగబాకాడు. మహ్మద్ రిజ్వాన్ ఆరు స్థానాలు ఎగబాకి వార్నర్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో ఉన్న లబుషేన్, రూట్, స్మిత్, విలియమ్సన్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. కోహ్లి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 885పాయింట్లతో తొలి స్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండో స్థానం.. బుమ్రా 830 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నారు.