Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1-0తో టెస్టు సిరీస్ కైవసం
లాహోర్ : ఉత్కంఠగా సాగిన లాహోర్ టెస్టు ఐదో రోజు చివరి సెషన్లో అద్వితీయ విజయం సాధించిన ఆస్ట్రేలియా మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. 351 పరుగుల రికార్డు ఛేదనలో ఆతిథ్య పాకిస్థాన్ 235 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ నాథన్ లయాన్ (5/83), కెప్టెన్ పాట్ కమిన్స్ (3/23) ఛేదనలో పాకిస్థాన్ నడ్డి విరిచారు. ఇమామ్ ఉల్ హాక్ (70, 199 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ బాబర్ ఆజాం (55, 104 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిసినా.. ఈసారి ఆసీస్ విజయాన్ని ఆపలేకపోయారు. 115 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా మూడో టెస్టులో గెలుపొందింది. కరాచీ టెస్టులో ఆఖరు వరకు చెమటోడ్చిన ఆస్ట్రేలియా..లాహోర్‌లో పట్టువిడువలేదు. పాకిస్థాన్ గడ్డపై మూడో టెస్టు సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆసీస్ వరుసగా 391, 227/3 పరుగులు చేయగా.. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులే చేసింది. బ్యాట్‌తో చెలరేగిన ఉస్మాన్ ఖవాజా 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలువగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన పాట్ కమిన్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' సాధించాడు.