Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో కీలక పోరు నేడు
- ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్
క్రైస్ట్‌చర్చ్ : బంగ్లాదేశ్‌పై ఎదురులేని విజయంతో నెట్ రన్‌రేట్‌ను అమాంతం పెంచుకున్న టీమ్ ఇండియా సెమీఫైనల్ అవకాశాలను దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వర్షార్పణం మ్యాచ్ తలకిందులు చేసింది!. సఫారీతో మ్యాచ్ వర్షార్పణంతో వెస్టిండీస్ ఓ పాయింట్ ఖాతాలో వేసుకుంది. సెమీఫైనల్లో చోటు కోసం టీమ్ ఇండియా అమ్మాయిలు లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రైస్ట్‌చర్చ్‌లో సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తున్నా.. మ్యాచ్ పూర్తిగా సాగదని చెప్పలేం. నేడు దక్షిణాఫ్రికాతో కనీసం ఓ పాయింట్ ఖాతాలో వేసుకుంటేనే టీమ్ ఇండియా ఇతర సమీకరణాలతో సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. నేడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందితే మిథాలీసేన వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించనుంది. నేడు ఉదయం 6.30 గంటలకు కీలక దక్షిణాఫ్రికా, భారత్ ఆరంభం.
మెరుస్తారా?! : ప్రపంచకప్ లీగ్ దశలో భారత మహిళల జట్టు మూడు విజయాలు, మూడు పరాజయాలతో నిలకడలేని ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికాతో చివరి ఐదు మ్యాచుల్లోనూ మిథాలీసేనకు మెరుగైన రికార్డు లేదు. స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు శతకాలతో కదం తొక్కినా.. కీలక మ్యాచుల్లో ఆశించిన మేరకు రాణించలేదు. ప్రపంచకప్ లీగ్ దశలో దక్షిణాఫ్రికా మంచి ప్రదర్శన చేసింది. ఆ జట్టును ఓడించాలంటే మిథాలీసేన సమిష్టి ప్రదర్శన చేయాలి. కెప్టెన్ మిథాలీరాజ్ లీగ్ దశలో పూర్తిగా నిరాశపరిచింది. మంధాన, హర్మన్‌ప్రీత్, షెఫాలీ వర్మ, స్నేV్‌ా రానాలతో పాటు మిథాలీరాజ్ రాణిస్తే దక్షిణాఫ్రికాపై విజయం సాధించవచ్చు. బౌలింగ్ విభాగం మెరుగ్గానే కనిపిస్తోంది. స్పిన్ మ్యాజిక్‌తో సఫారీ బ్యాటర్లకు చెక్ పెట్టగలదు. సఫారీ శిబిరంలో లారా, సునె లుస్, కాకా, ఇస్మాయిల్ కీలకం కానున్నారు.
ఒలింపిక్ హీరోలకు సత్కారం : టోక్యో ఒలింపిక్ హీరోలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. 2020 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు బోర్డు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఐపీఎల్ 15 ఆరంభ వేడుకల్లో ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాకు రూ.1 కోటి నగదు బహుమతి అందించింది. బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్‌కు రూ.25 లక్షలు, మెన్స్ హాకీ జట్టుకు రూ.1 కోటి అందజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాలు చెక్‌లు అందజేశారు.