Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ పోరుకు సింధు, ప్రణరు
- సెమీఫైనల్లో సాధికారిక విజయాలు
- స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్
భారత బ్యాడ్మింటన్ మళ్లీ ఊపందుకుంది!. గత వారం ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ టైటిల్ పోరులో తలపడగా.. ఈ వారం ఇద్దరు షట్లర్లు స్విస్ టైటిల్ రేసులో నిలిచారు. అగ్ర షట్లర్ పి.వి సింధు, హెచ్.ఎస్ ప్రణరులు స్విస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించారు.
బసెల్ (స్విట్జర్లాండ్)
మూడు గేములు, గంటకు పైగా పోరాటం, ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ, ఒత్తిడితో కూడిన ఉత్కంఠ సెమీఫైనల్లో భారత షట్లర్లు పైచేయి సాధించారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు ఫైనల్లోకి ప్రవేశించగా.. పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్.ఎస్ ప్రణరు తుది పోరులో సమరానికి సై అన్నాడు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ మ్యాచుల్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన సింధు, ప్రణరు నేడు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నారు. 21-18, 15-21, 21-19తో పి.వి సింధు, 21-19, 19-21, 21-18తో హెచ్.ఎస్ ప్రణరు సెమీస్‌లో విజయాలు నమోదు చేశారు. సుదీర్ఘ విరామం అనంతరం ఓ టోర్నీలో మహిళల, పురుషుల ఫైనల్లో భారత క్రీడాకారులు తలపడనుండటం విశేషం.
దూకుడు : మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి సింధు దూకుడు ప్రదర్శించింది. థారులాండ్ అమ్మాయి సుపనిదపై తొలి గేమ్‌లో పైచేయి సాధించింది. ఆరంభంలో నువ్వా నేనా అన్నట్టు సాగినా.. విరామ సమయానికి 11-7తో సింధు ఆధిక్యం దక్కించుకుంది. ద్వితీయార్థంలోనూ జోరు పెంచిన సింధు తొలి గేమ్‌ను 21-19తో గెల్చుకుంది. రెండో గేమ్‌లో సుపనిద గొప్పగా పుంజుకుంది. సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 11-3తో విరామ సమయానికి ఎదురులేని స్థానంలో నిలిచిన సుపనిద అలవోకగా సమం చేసింది. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. ఉత్కంఠగా సాగిన మూడో గేమ్‌లో సింధు అద్భుత ప్రదర్శన చేసింది. 11-10తో విరామ సమయానికి సింధు ముందంజ వేసినా.. 18-16తో సుపనిద ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 19-19తో స్కోరు సమం చేసిన సింధు వరుస పాయింట్లతో ఫైనల్లోకి కాలుమోపింది. 80 నిమిషాల ఉత్కంఠ పోరులో వరల్డ్ నం.7 సింధుకు థారులాండ్ షట్లర్ గట్టి పోటీనిచ్చింది. నేడు ఫైనల్లో థారులాండ్ షట్లర్ బుసానన్‌తో సింధు తలపడనుంది. బుసానన్‌తో సింధు 15-1 ముఖాముఖి రికార్డు కలిగి ఉంది.
పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు ఉత్కంఠ ూ్యచ్లో పైచేయి సాధించాడు. మూడో సీడ్, ఇండోనేషియా షట్లర్ ఆంటోనిపై ప్రణరు మెరుపు విజయం నమోదు చేశాడు. 72 నిమిషాల సెమీస్‌లో ఆంటోనిని చిత్తు చేశాడు. తొలి గేమ్‌ను 21-19తో గెల్చుకున్న ప్రణరు రెండో గేమ్‌లో తడబడ్డాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆంటోనిపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. 11-7తో ఆధిక్యంలో నిలిచిన ప్రణరు.. 16-10తో దూసుకెళ్లాడు. చివర్లో ఆంటోని పాయింట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ ప్రణరు 21-18తో ఫైనల్ బెర్త్ ఎగరేసుకుపోయాడు.