Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్విస్ ఓపెన్ చాంపియన్‌గా తెలుగు తేజం
- ఫైనల్లో బుసానన్‌పై ఏకపక్ష విజయం
- రన్నరప్‌తో సరిపెట్టుకున్న ప్రణరు
- స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2022
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు మళ్లీ వేట మొదలుపెట్టింది. కోవిడ్-19 పరిస్థితుల్లో నిలకడ లేమి ప్రదర్శనకు ముగింపు పలికిన తెలుగు తేజం స్విస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. థారులాండ్ అమ్మాయి బుసానన్‌పై గెలుపొందిన సింధు మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో హెచ్.ఎస్ ప్రణరు నిరాశపరిచాడు. రన్నరప్ టైటిల్‌తో ప్రణరు సరిపెట్టుకున్నాడు.
బసెల్ (స్విట్జర్లాండ్)
భారత బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ పి.వి సింధు అద్భుత ప్రదర్శన. స్విస్ ఓపెన్ ఫైనల్లో ఏకపక్ష విజయం నమోదు చేసిన తెలుగు తేజం మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. 50 నిమిషాల ఏకపక్ష టైటిల్ పోరులో థారులాండ్ షట్లర్ బుసానన్‌పై సింధు అలవోక విజయం సాధించింది. 21-16, 21-8తో వరుస గేముల్లో పి.వి సింధు ఫైనల్లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో రెండో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది ఆరంభంలో సయ్యద్ మోడీ సూపర్ సిరీస్ విజేతగా నిలిచిన సింధు.. స్విస్ ఓపెన్ విజయంతో రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో హెచ్.ఎస్ ప్రణరు నిరాశపరిచాడు. ఇండోనేషియా షట్లర్ జొనాథన్ క్రిస్టీ చేతిలో 12-21, 18-21తో వరుస గేముల్లోనే పరాజయం పాలయ్యాడు.
సింధుకు ఎదురేది? : నాల్గో సీడ్ థారులాండ్ షట్లర్ బుసానన్‌పై సింధు ముఖాముఖి రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. తాజా విజయంతో 16-1తో బుసానన్‌పై తిరుగులేని ఆధిపత్యం నిలుపుకుంది. సింధుతో 17 మ్యాచుల్లో తలపడిన బుసానన్.. ఓ సారి మాత్రమే గెలుపు రుచి చూడగల్గింది. కీలక ఫైనల్లో సింధు అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. ఆరంభంలో బుసానన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. 3-0తో దూసుకెళ్లిన సింధు.. 3-5తో వెనుకంజ వేసింది. విరామ సమయానికి 11-10తో స్వల్ప ఆధిక్యత నిలుపుకున్న సింధు ద్వితీయార్థంలోనూ పాయింట్ల కోసం చెమటోడ్చింది. 13-13 వద్ద బుసానన్ను వెనక్కి నెట్టిన సింధు అక్కడ్నుంచి వరుస పాయింట్లు సాధించింది. చివర్లో సింధు దూకుడు ముందు తేలిపోయిన బుసానన్ గేమ్‌ను నిలుపుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రెండో గేమ్‌లో సింధుకు అసలు ఎదురులేదు. ఏ దశలోనూ బుసానన్ నుంచి పోటీ ఎదురుకాలేదు. 5-0తో తిరుగులేని ఆరంభం దక్కించుకున్న సింధు విరామ సమయానికి 11-2తో గెలుపు ఖాయం చేసుకుంది. మరోసారి వరుసగా ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న సింధు 21-8తో రెండో గేమ్‌తో పాటు స్విస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ప్రణయ్‌కి నిరాశ : పురుషుల సింగిల్స్ ఫైనల్లో హెచ్.ఎస్ ప్రణరు ఆశించిన ప్రదర్శన చేయలేదు. 48 నిమిషాల టైటిల్ పోరులో ప్రణరు వరుస గేముల్లోనే ఆశలు వదులుకున్నాడు. 12-21, 18-21తో ఇండోనేషియా షట్లర్‌కు కనీస పోటీ ఇవ్వలేదు. సెమీఫైనల్లో అద్వితీయ ప్రదర్శన చేసిన ప్రణరు.. టైటిల్ పోరులో దారుణంగా నిరాశపరిచాడు. తొలి గేమ్‌లో 8-8 వరకు రేసులో నిలిచిన ప్రణరు ఆ తర్వాత పట్టు కోల్పోయాడు. 8-11తో విరామ సమయానికి వెనుకంజ వేసిన ప్రణరు మళ్లీ పుంజుకోలేదు. 12-21తో తొలి గేమ్‌ను దారుణంగా వదులుకున్నాడు. అమీతుమీ తేల్చుకోవాల్సిన రెండో గేమ్‌లో ప్రణరు కాస్త పోరాట పటిమ కనబరిచినా.. అది సరిపోలేదు. 13-13తో క్రిస్టీతో సమవుజ్జీగా నిలిచిన ప్రణరు అక్కడ్నుంచి వరుస పాయింట్లు కోల్పోయాడు. చివర్లోనూ పుంజుకోలేదు. 18-21తో రెండో గేమ్‌ను సైతం ఓడిపోయిన ప్రణరు మెన్స్ సింగిల్స్ రన్నరప్‌గా నిలిచాడు.