Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నోపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
- అదరగొట్టిన షమీ
- హుడా, బడోనీ అర్ధసెంచరీలు
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో కొత్త జట్ల మధ్య జరిగిన పోటీలో గుజరాత్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నోను షమీ దెబ్బతీసాడు. లక్నో జట్టు కెప్టెన్ రాహుల్‌ను షమీ గోల్డెన్ డక్‌గా ఔట్ చేశాడు. ఆ తర్వాత డికాక్, లెవీస్, మనీష్ నిరాశపరచడంతో 29 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో దీపక్ హుడా(55; 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), 18ఏళ్ల ఢిల్లీ యువ క్రికెటర్ ఆయుశ్ బడోనీ(54; 41బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. చివర్లో కృనాల్ పాండ్యా(21నాటౌట్; 13బంతుల్లో 3పోర్లు) రాణించాడు.
కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్
ఐపిఎల్ కొత్త జట్లయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఓ అరుదైన ఘన చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహమ్మద్ షమీ తొలి బంతికే లక్నో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఔట్ చేశాడు. కొత్త బంతితో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న అతను.. మ్యాచ్ తొలి బంతికే సూపర్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు.
ఛేదనలో గుజరాత్ జట్టు తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. 15 పరుగులకే శుభ్‌మన్, విజరు శంకర్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత హార్దిక్(33), వేడ్(30) రాణించడంతో నిలదొక్కుకున్నా.. చివర్లో తెవాటియా(40నాట ౌట్), మిల్లర్(30) మ్యాచ్‌ను ముగించారు. చివరి ఓవర్లో 11 పరుగులు కావల్సిన దశలో మనోహర్(15నాటౌట్) వరుసగా 2ఫోర్లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. దీంతో గుజరాత్ జట్టు 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షమీకి లభించింది.
స్కోర్‌బోర్డు..
లక్నో సూపర్‌జెయింట్స్ : కేఎల్ రాహుల్ (సి)వేడ్ (బి)షమీ 0, డికాక్ (బి)షమీ 7, లెవీస్ (సి)శుభ్‌మన్ (బి)ఆరోన్ 10, మనీష్ (బి)షమీ 6, దీపక్ హుడా (ఎల్బి) రషీద్ 55, ఆయుశ్ బడోనీ (సి)హార్దిక్ (బి)ఆరోన్ 54, కృనాల్ పాండ్యా (నాటౌట్) 21, ఛమీర (నాటౌట్) 1, అదనం 4. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 157 పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/13, 3/20, 4/29, 5/116, 6/156
బౌలింగ్: షమీ 4-0-25-3, ఆరోన్ 4-0-45-2, ఫెర్గ్యూసన్ 4-0-24-0, హార్దిక్ 4-0-37-0, రషీద్ 4-0-27-1.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ (సి)హుడా (బి)ఛమీర 0, వేడ్ (బి)దీపక్ హుడా 30, విజరు శంకర్ (బి)ఛమీర 4, హార్దిక్ (సి)మనీశ్ (బి)కృనాల్ 33, మిల్లర్ (సి)రాహుల్ (బి)ఆవేశ్ ఖాన్ 30, తెవాటియా (నాటౌట్) 40, మనోహర్ (నాటౌట్) 15, అదనం 9, (19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 161 పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/15, 3/72, 4/78, 5/138
బౌలింగ్: ఛమీర 3-0-22-2, ఆవేశ్ ఖాన్ 3.4-0-33-1, మొహిసిన్ ఖాన్ 2-0-18-0, రవి బిష్ణోరు 4-0-34-0, కృనాల్ 4-0-17-1, దీపక్ హుడా 3-0-31-1.