Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.50వేల కోట్లు ధనార్జనే లక్ష్యం
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) రాబోయే ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ఈ-వేలం ద్వారా దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఆన్లైన్ ద్వారా జూన్ 12 వరకు 2023-27 కాలానికి సంబంధించి ఇ-వేలం ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. బిసిసిఐ సెక్రటరీ జే షా మంగళవారం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఐపిఎల్‌లో ఈ సీజన్ నుంచి 10జట్లు ప్రాతినిధ్యం వహించడం, ఐపిఎల్ మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పెరగడమే ఇందుకు కారణంగా జే షా ఆ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు మీడియా హక్కులను స్టార్ స్పోర్స్ గడువు ఈ సీజన్ ఐపిఎల్‌తో ముగియనుంది. దీంతో తాజాగా మీడియా హక్కులకై బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జీ, సోనీ, రిలయెన్స్ వియాకామ్-18 రేసులో ఉన్నట్లు సమాచారం. జిఎస్టి మినహా రూ.25లక్షల నాన్-రిఫండబుల్ రుసుముతో ఇ-వేలంలో దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది.