Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ తొలి సెమీస్ నేడు
- వన్డే ప్రపంచకప్‌లో నేడు...
- ఆస్ట్రేలియా × వెస్టిండీస్
- వేదిక: వెల్లింగ్టన్ ; ఉ.3.30గం||ల నుంచి
వెల్లింగ్టన్: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్, టోర్నీలో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తోన్న ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడనుంది. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ గాయం కారణంగా వెస్టిండీస్‌తో సెమీఫైనల్‌కు దూరమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడిన పెర్రీ ఇంకా కోలుకోలేదు. ఆ మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా మూడు ఓవర్లు వేసిన తర్వాత ఆమె మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లింది. ఈ క్రమంలో కీలకమైన సెమీఫైనల్‌కు పెర్రీ దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ వెల్లడించింది. ''దురదష్టవశాత్తూ పెర్రీ సేవలను సెమీఫైనల్లో కోల్పోతున్నాము. మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.ఆమె ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ప్రస్తుతం పెర్రీ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. పెర్రీ స్థానంలో డెత్ బౌలర్‌ను జట్టులోకి తీసుకువస్తాం'' అని లానింగ్ పేర్కొంది. ఇక రెండో సెమీస్ ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం జరగనుంది.