Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిస్బన్(పోర్చుగల్): ఫిఫా ప్రపంచకప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన పోటీలో పోర్చుగల్ జట్టు 2-0 గోల్స్ తేడాతో నార్త్ మెసడోనియాను ఓడించింది. పోర్చుగల్ తరఫున రెండు గోల్స్‌ను బ్రూనో ఫెర్నాండెజ్ చేశాడు. పోర్చుగల్‌లోనే సోల్డ్ ఔట్ డ్రాగో స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సుమారు 50వేల మంది అభిమానులు హాజరుకావడం విశేషం. పోర్చుగల్ జట్టు ఈ మ్యాచ్‌లో తొలినుంచే పైచేయి సాధించింది. నార్త్ మెసడోనియా జట్టు డిఫెన్స్‌కే పరిమితం కాగా.. 70% బంతి పోర్చుగల్ ఆటగాళ్ల ఆధీనంలో ఉండడం విశేషం. తొలి గోల్‌ను ఫెర్నాండో 30వ ని.లో, రెండో గోల్‌ను 65వ ని.లో కొట్టాడు. నార్త్ మెసడోనియా జట్టు ఇటలీని ఓడించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ వేదికగా 2016లో జరిగిన యూరోపియన్ ఛాంపియన్ టైటిల్‌ను నెగ్గిన పోర్చుగల్ జట్టు వరుసగా 6వ సారి ప్రపంచకప్‌కు అర్హత సాధించడం విశేషం.