Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్
వెల్లింగ్టన్: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 157 పరుగుల తేడాతో విజయం వెస్టిండీస్‌ను ఓడించి ఏడోసారి టైటిల్ ఫౖెెనల్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా 45ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 305పరుగుల భారీస్కోర్ చేసింది. ఓపెనర్లు హేన్స్(85), హీలీ(129) తొలి వికెట్‌కు డబుల్ సెంచరీ(216పరుగులు) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో బెత్ మూనీ దాటిగా ఆడి 31 బంతుల్లోనే 3ఫోర్ల సాయంతో 43పరుగులు చేసింది. హెన్రీకి రెండు, కానెల్‌కు ఒక వికెట్ లభించాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు ఓపెనర్ డోటిన్(34), మాథ్యూస్(34), కెప్టెన్ టేలర్(48) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. మిగతా బ్యాటర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హీలీకి లభించింది.