Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: రష్యాకు చెందిన 2వ సీడ్ డానియేల్ మెద్వెదెవ్ టాప్ ర్యాంక్‌కు చేరువలో నిలిచాడు. మంగళవారం రాత్రి జరిగిన మియామీ ఓపెన్‌లో అమెరికాకు చెందిన జెన్సన్ను 7-5, 6-1తో ఓడించి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే టాప్ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. క్వార్టర్ఫైనల్లో మెద్వెదెవ్ డిఫెండింగ్ ఛాంపియన్ హబర్ట్ హుర్క్రాజ్తో తలపడనున్నాడు. అదే జరిగితే సోమవారం డబ్ల్యుటిఏ ప్రకటించే ర్యాంకింగ్స్‌లో మెద్వెదెవ్ టాప్‌లో నిలవనున్నాడు. దీంతో రెండేళ్లుగా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న నొవాక్ జకోవిచ్ తొలిసారి రెండోస్థానానికి దిగజారనున్నాడు.