Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపు
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15లో భాగంగా బుధవారం డివై పాటిల్ స్టేడియంలో జరిగి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. ఆర్సీబీ బౌలర్లు చెలరగేడంతో 128పరుగులకే కుప్పకూలింది. లక్ష్యఛేదనలో ఆర్సీబీ జట్టు 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రెహానే, వెంకటేశ్ అయ్యర్లు స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కోల్ కతా తరఫున ఒక్కరు కూడా క్రీజులో కుదురుకోలేకపోయారు. వెరసి 128 పరుగులకే కోల్‌కతా తన ఇన్నింగ్స్‌ను ముగించేసింది. ఇక బంతులతో రెచ్చిపోయిన బెంగళూరు బౌలర్లు కోల్‌కతా బ్యాటర్లను ఏమాత్రం కుదురుకోనీయకుండా పకడ్బందీగా బౌలింగ్ చేశారు. బెంగళూరు బౌలర్లలో హసరంగా ఏకంగా 4 వికెట్లు తీసుకోగా..ఆకాశ్ దీప్ 3 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నారు. ఛేదనలో బెంగళూరు జట్టు తొలుత కొంత వెనుకబడ్డా ఆ తర్వాత పుంజుకుంది. రూథర్‌ఫర్డ్, షాబాద్కి తోడు చివర్లో దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో ఆర్సీబీ జట్టు 19.2 ఓవర్లలో 132 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హసరంగకు లభించింది.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్: రహానే (సి)షాబాజ్ (బి)సిరాజ్ 9, వెంకటేశ్ అయ్యర్ (సి అండ్ బి)ఆర్ష్‌దీప్ 10, శ్రేయస్ అయ్యర్ (సి)డుప్లెసిస్ (బి)హసరంగ 13, నితీశ్ రాణా (సి)విల్లే (బి)ఆర్ష్‌దీప్ 10, నరైన్ (సి)ఆర్ష్‌దీప్ (బి)హసరంగ 12, బిల్లింగ్స్ (సి)కోహ్లి (బి)హర్షల్ పటేల్ 14, జాక్సన్ (బి)హసరంగ 0, రస్సెల్ (సి)కార్తీక్ (బి)హర్షల్ పటేల్ 25, సౌథీ (సి)డుప్లెసిస్ (బి)హసరంగ 1, ఉమేశ్ (బి)ఆర్ష్‌దీప్ 18, చక్రవర్తి (నాటౌట్) 10, అదనం 6. (18.5 ఓవర్లలో ఆలౌట్) 128పరుగులు.
వికెట్ల పతనం: 1/14, 2/32, 3/44, 4/46, 5/67, 6/67, 7/83, 8/99, 9/101, 10/128
బౌలింగ్: విల్లే 2-0-7-0, సిరాజ్ 4-0-25-1, ఆర్ష్‌దీప్ 3.5-0-45-3, హసరంగ 4-0-20-4, హర్షల్ పటేల్ 4-3-11-2, షాబాజ్ 1-0-16-0
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్ (సి)రహానే (బి)సౌథీ 5, రావత్ (సి)జాక్సన్ (బి)ఉమేశ్ 0, కోహ్లి (సి)జాక్సన్ (బి)ఉమేశ్ 12, విల్లీ (సి)నితీశ్ రాణా (బి)నరైన్ 18, రూథర్‌ఫర్డ్ (సి)జాక్సన్ (బి)సౌథీ 28, షాబాజ్ (స్టంప్)జాక్సన్ (బి)చక్రవర్తి 27, దినేశ్ కార్తీక్ (నాటౌట్) 14, హసరంగ (సి)రస్సెల్ (బి)సౌథీ 4, హర్షల్ పటేల్ (నాటౌట్) 10, అదనం 14. (19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 132 పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/17, 3/17, 4/62, 5/101, 6/107, 7/111
బౌలింగ్: ఉమేశ్ 4-0-16-2, సౌథీ 4-0-20-3, రస్సెల్ 2.2-0-36-0, నరైన్ 4-0-12-1, వరణ్ చక్రవర్తి 4-0-33-1, వెంకటేశ్ అయ్యర్ 1-0-10-0.