Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల హాకీ జూనియర్ ప్రపంచకప్ నేటి నుంచి
పాచెఫ్‌స్ట్రూమ్: మహిళల హాకీ జూనియర్ ప్రపంచకప్‌లో యువ భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో యువ క్రీడాకారిణులు సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. గ్రూప్ దశలో గ్రూప్-డిలో ఉన్న భారత్ శనివారం వేల్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఏప్రిల్ 3న జర్మనీ, 5న మలేషియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో టాప్ పొజిషన్లో నిలిస్తే క్వార్టర్స్‌కు దూసుకెళ్లనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన సలీమా టెటె జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత్ సారథ్య బాధ్యతలు చేపట్టడం అనుకూలం. సీనియర్ మిడ్ ఫీల్డర్ షర్మిలా దేవి, స్ట్రయికర్ లాల్రెసియామి చేరిక జట్టుకు అదనపు బలం కానుంది. ఈ టోర్నీల్లో నాలుగు సార్లు బరిలోకి దిగిన యువ భారత్ 2013లో కాంస్యమే అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్‌కు అర్హత సాధించని జూనియర్లు.. ఈ టోర్నీలో ఏకంగా టైటిల్ నెగ్గేందుకు ఉరకలేస్తున్నారు.
భారత జట్టు: బిచుదేవి ఖరిబమ్, ఖుష్బు. మరినా లాల్రెంఘాకి, ప్రీతి, ప్రియాంక, ఇషిక (వైస్ కెప్టెన్), అక్షత, వైష్ణవి ఫాల్కే, సలిమా టెటె (కెప్టెన్), రీత్, మంజు, అజ్మినా, షర్మిలా దేవి, లాల్‌రెమిసియామి, బల్జీత్ కౌర్, లాల్రిండికి, జివాన్ కిశోరి, ముంతాజ్, బ్యూటీ, దీపిక, సంగీత
స్టాండ్ బై: దీపిక, నీలమ్, మంజు, రుతుజ, అన్ను.