Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్నెస్ సాధించిన స్టార్ బ్యాటర్
ముంబయి : వెస్టిండీస్‌తో సిరీస్‌లో గాయపడిన భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతానికి పూర్తిగా కోలుకున్నాడు. క్వారంటైన్ గడువు పూర్తవడంతో గురువారం ముంబయి ఇండియన్స్ శిబిరంలో చేరాడు. గాయపడిన సూర్యకుమార్ యాదవ్ బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్‌లో గడిపాడు. ఎన్సీఏలో పూర్తి ఫిట్నెస్ సాధించిన సూర్యకుమార్ యాదవ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ అందుబాటులో ఉండనున్నాడు.