Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తు ొఐసీసీ మహిళల వరల్డ్‌కప్
క్రైస్ట్‌చర్చ్ : గ్రూప్ దశలో తొలి మూడు మ్యాచుల్లో ఘోర పరాజయాలు. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఖేల్ ఖతమనే మాటలు ఘాటుగా వినిపిస్తున్న తరుణం. అయితేనేం, ఇంగ్లాండ్ గొప్పగా పుంజుకుంది. గ్రూప్ దశలో మెరుపు విజయాలతో టాప్-4లో నిలిచిన ఇంగ్లీష్ అమ్మాయిలు.. నాకౌట్లో తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. నిలకడగా రాణించిన దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో ఏకపక్ష విజయం సాధించింది ఇంగ్లాండ్. క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లాండ్ ఆధిపత్యం నడిచిన సెమీస్ సమరంలో దక్షిణాఫ్రికా 137 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. మహిళల ప్రపంచకప్ కోసం మరోసారి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఏప్రిల్ 3న టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా ఢకొీట్టనుంది.
వ్యాట్ మోత : తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డానీ వ్యాట్ (129, 125 బంతుల్లో 12 ఫోర్లు) ధనాధన్ శతకం బాదింది. ఓపెనర్ టామీ బ్యూమోంట్ (7), కెప్టెన్ హీథర్ నైట్ (1), స్టార్ బ్యాటర్ నటాలీ సీవర్ (15) వైఫల్యంతో ఆరంభంలో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి కనిపించింది. సోఫీ డంక్లీ (60, 72 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీతో డెత్ ఓవర్లలో దుమ్మురేపగా.. టాప్ ఆర్డర్లో డానీ వ్యాట్ చెలరేగింది. ఆరు ఫోర్లతో 56 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన వ్యాట్.. పది బౌండరీల సాయంతో 98 బంతుల్లోనే శతకబాదింది. వ్యాట్‌కు తోడు డంక్లీ చెలరేగటంతో ఇంగ్లాండ్ 293 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్ (3/46), మరిజానా కాప్ (2/52), మసబాట క్లాస్ (2/55)లు రాణించారు.
సూపర్ సోఫీ : 294 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. ఛేదనలో ఏ దశలోనూ పోరాట స్ఫూర్తి చూపించలేదు. ఇంగ్లాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకల్‌స్టోన్ (6/36) ఆరు వికెట్ల మాయజాలం ముందు సఫారీలు తేలిపోయారు. లిజెలీ లీ (2), లారా (0), చోలె (3)లు దారుణంగా విఫలమయ్యారు. లారా గుడాల్ (28), సునె లుస్ (21), మిగ్నాన్ డు ప్రీజ్ (30), మరిజానా కాప్ (21), త్రిష చెట్టి (21) పోరాటం ఏమాత్రం సరిపోలేదు. ఇంగ్లాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ఛేదనలో సఫారీలపై మానసికంగా పైచేయి సాధించారు. 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా 137 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది.
సంక్షిప్త స్కోర్లు :
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 293/8 (డానీ వ్యాట్ 129, సోఫీ డంక్లీ 60, ఇస్మాయిల్ 3/46, మరిజాన 2/52)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : 156/10 (మిగ్నాన్ 30, లారా 28, త్రిష 21, సోఫీ ఎకల్‌స్టోన్ 6/36, అన్యా 2/27).